పంజాబ్ స్కూల్‌లో దారుణం.. ఏడో తరగతి అమ్మాయిల దుస్తులు విప్పించి శానిటరీ ప్యాడ్స్‌ కోసం వెతికిన టీచర్లు!

04-11-2018 Sun 09:55 | National
  • 15 మంది విద్యార్థుల దుస్తులు విప్పించి తనిఖీ
  • ఇద్దరు టీచర్లను బదిలీ చేసిన ప్రభుత్వం
  • అజ్ఞాతంలో మరో టీచర్
పంజాబ్‌లోని ఫజికా జిల్లాలో ఓ స్కూల్‌లో దారుణం చోటుచేసుకుంది. శానిటరీ నాప్‌కిన్స్ కోసం 7, 8 తరగతి చదువుతున్న 15 మంది బాలికల దుస్తులు విప్పించి మరీ టీచర్లు తనిఖీ చేశారు. స్కూలు టాయిలెట్‌లో ఓ శానిటరీ న్యాప్‌కిన్ కనిపించడంతో దానిని ఎవరు ధరించారో తెలుసుకునేందుకు టీచర్లు ప్రయత్నించారు.

ఏడు, ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికల దుస్తులు విప్పించి తనిఖీ చేశారు. ఈ విషయాన్ని బాలికలు తమ తల్లిదండ్రులకు చెప్పారు. వారు స్కూలు అధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై దుమారం రేగడంతో ప్రభుత్వం స్పందించింది. ఇద్దరు టీచర్లను బదిలీ చేసింది. మరో టీచర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఈ ఘటనపై సోమవారం నాటికి దర్యాప్తు పూర్తి చేయాల్సిందిగా విద్యాశాఖ కార్యదర్శిని ముఖ్యమంత్రి ఆదేశించారు.

కాగా, ఇటువంటి ఘటనే ఈ ఏడాది మార్చిలో మధ్యప్రదేశ్‌లో జరిగింది. హాస్టల్ ఆవరణలో శానిటరీ నాప్‌కిన్ దొరకడంతో ఏకంగా 40 మంది బాలికల దుస్తులు విప్పించి తనిఖీ చేశారు. అప్పట్లో ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది.
strip-searchpunjabGirlsschoolsanitary pad

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more