పెళ్లి వద్దు మొర్రో అని మొత్తుకున్నా వినలేదు.. విడాకులకు కారణం చెప్పిన తేజ్ ప్రతాప్ యాదవ్
- ఐశ్వర్య మోడరన్‌గా ఉంటుంది
- నేనేమో పాతకాలపు మనిషిలా ఉంటా
- ఈ నిర్బంధ జీవితం నాకొద్దు
పాట్నాలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. దాదాపు పదివేల మంది అతిథులు హాజరయ్యారు. తాజాగా, ఐశ్వర నుంచి తనకు విడాకులు ఇప్పించాల్సిందిగా కోరుతూ తేజ్ ప్రతాప్ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం హాట్ టాపిక్ అయింది. ఈ విషయమై తేజ్ ప్రతాప్ విలేకరులతో మాట్లాడుతూ.. తన ఇష్టానికి వ్యతిరేకంగా ఈ వివాహం జరిగిందని పేర్కొన్నారు. తానో సేవకుడిగా మాత్రమే ఉండదలిచానని, ఈ నిర్బంధ జీవితం తనకు అవసరం లేదని పేర్కొన్నారు.