నేను చనిపోయే లోపు ఆ అవకాశం దేవుడు కల్పిస్తాడని నమ్ముతున్నా: హీరో శివాజీ
- శ్రీ వేంకటేశ్వరస్వామికి నేను పరమ భక్తుడిని
- టీటీడీ చైర్మన్ అవ్వాలన్నది నా చిన్ననాటి కోరిక
- టీటీడీని రాజకీయ అవసరాలకు వాడుకోవడం తగదు
శ్రీ వేంకటేశ్వరస్వామికి తాను పరమ భక్తుడినని, చనిపోయేలోపు టీటీడీ చైర్మన్ అయ్యే అవకాశం ఆ దేవుడే కల్పిస్తాడని ప్రత్యేకహోదా సాధన నేత, ప్రముఖ హీరో శివాజీ అన్నారు. ‘ఏబీఎన్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, టీటీడీ చైర్మన్ అవ్వాలన్నది తన చిన్ననాటి కోరిక అని అన్నారు. వేంకటేశ్వరుడి ఆలయంలో జరుగుతున్న అవకతవకలపై తాను గళం విప్పానని, టీటీడీని రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని విమర్శించారు.
టీటీడీని ఎవరూ ఏమీ చేయలేరని, ఆ స్వామికి ఏం కావాలో అవి చేయించుకుంటాడంటూ తన భక్తిని చాటుకున్నారు. తిరుమలలో వైకుంఠ దర్శనం రోజు రాజకీయ నాయకులు ఒక్కసారి మాత్రమే దర్శనం చేసుకునేలా నిబంధన తేవాలని, సదరు రాజకీయనాయకుడికి కానీ, ఆయన కుటుంబసభ్యులకు గానీ మళ్లీ టికెట్ ఇవ్వకూడదని, ఆ అవకాశం భక్తులకు కల్పించాలని శివాజీ అభిప్రాయపడ్డారు.