తెలంగాణలో ఎన్నికల పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేసిన విజయశాంతి!
- అవసరార్థమే టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం
- పరిమితులు నిర్దేశించుకోవాలని ఉత్తమ్ కు చెప్పా
- హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన నటి
హైదరాబాద్ లో ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. టీడీపీతో కొన్ని అంశాల్లో హద్దులను నిర్దేశించుకుని పనిచేయాల్సిందిగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించినట్లు విజయశాంతి తెలిపారు. మహాకూటమిలో సీట్ల పంపకంపై చర్చించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు,ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో భేటీ అయిన సందర్భంగా విజయశాంతి ఈ మేరకు స్పందించారు.