మీడియా సమావేశంలో ‘అతడు’ సినిమా చూపించిన సోమిరెడ్డి!
- ఏపీ పోలీసులపై జగన్ కు నమ్మకం లేదా?
- 350 కోట్లు వెళ్లిపోతే గవర్నర్ సైలెంట్ గా ఉన్నారు
- వైసీపీ, బీజేపీ నేతల భాష బాగోలేదు
ప్రజాసంకల్ప యాత్ర పేరిట 3,000 కిలోమీటర్లు తిరిగినా ప్రజల్లో జగన్ కు ఆదరణ లేదని ఆయన విమర్శించారు. దీంతో సానుభూతి పొందేందుకు వీలుగానే ఈ హత్యయత్నం జరిగిందన్నారు. నిందితుడు శ్రీనివాసరావుపై కేసు పెట్టేందుకు కూడా జగన్ ఇష్టపడటం లేదనీ, ఎందుకంటే అతను వైసీపీ మనిషని వ్యాఖ్యానించారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘అతడు’ సినిమాలో సాయాజీ షిండే తరహాలో సానుభూతి పొందేందుకు జగన్ ఈ హత్యాయత్నం డ్రామా ఆడారని విమర్శించారు. ఈ సందర్భంగా అతడు సినిమాలో షిండే చెప్పే..‘నాపై హత్యాయత్నం జరగాలి. కానీ నేను మాత్రం బతకాలి’ అని చెబుతున్న వీడియో క్లిప్ ను ప్రదర్శించారు.
జగన్ ను హత్య చేయాలని టీడీపీ కుట్రలు పన్నినట్లు సాక్షి పత్రికలో వార్తలు రాశారనీ, ఆ అవసరం తమకు లేదని తెలిపారు. వైసీపీ, బీజేపీ నేతలు వాడుతున్న భాష అభ్యంతరకరంగా ఉంటోందనీ, దాన్ని మార్చుకోవాలని సూచించారు. జగన్ కు ఏపీ పోలీసులు, ఏపీ శాసనసభ, పార్లమెంటు సహా ఏ వ్యవస్థపైన కూడా జగన్ కు నమ్మకం లేదని ఎద్దేవా చేశారు.