ఏలూరు కోర్టుకు వాస్తు దోషం.. ప్రధాన గేటు మూసివేత
- ఏలూరు కోర్టులో కొన్ని రోజుల క్రితం కొత్త ద్వారం ఏర్పాటు
- ఆ తర్వాత హఠాత్తుగా చనిపోయిన కొందరు న్యాయవాదులు
- గేటును మూసివేయాలంటూ వాస్తు నిపుణుల సూచన
కోర్టుకు వచ్చిన పలువురు వాస్తు పండితులు... కోర్టులో ఏర్పాటు చేసిన కొత్త ద్వారం వల్ల వాస్తు దోషం ఏర్పడిందని, దీంతో ఆ ద్వారాన్ని మూసివేయాలని సూచించారు. ఇదే విషయాన్ని బార్ అసోసియేషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో గేటును మూసివేయాలంటూ ప్రధాన న్యాయమూర్తిని బార్ అసోసియేషన్ కోరింది. దీంతో, గేటు మూసి వేసి... అక్కడ ఓ ఫ్లెక్సీ పెట్టారు. 'ఈ గేటు మూయబడినది. పాత గేటు నుంచి మరియు వెనక గేటు నుంచి రావలెను' అంటూ ఫ్లెక్సీపై రాశారు.