'ఎన్టీఆర్' నుంచి 'దగ్గుబాటి' లుక్ వచ్చేసింది!
- దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా నటిస్తున్న భరత్ రెడ్డి
- నేడు భరత్ రెడ్డి పుట్టిన రోజు
- ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన యూనిట్
నేడు భరత్ రెడ్డి పుట్టినరోజు కాగా, ఈ సందర్భంగా ఈ పోస్టర్ విడుదలైంది. ఈ సినిమాలో పలు ముఖ్య పాత్రలను టాలీవుడ్ ప్రముఖ నటీనటులు పోషిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేసి, వచ్చే సంవత్సరం సంక్రాంతికి ముందు ఓ భాగం, తరువాత మరో భాగాన్ని విడుదల చేసే యోచనలో ఉన్నాడు క్రిష్.