ఈ ఆనందాన్ని మీతోనే కాదు, బాబాయ్ తో కూడా పంచుకోవాలనుకుంటున్నా!: ఎన్టీఆర్
Add ap7am to your home Screen

ఈ ఆనందాన్ని మీతోనే కాదు, బాబాయ్ తో కూడా పంచుకోవాలనుకుంటున్నా!: ఎన్టీఆర్

  • నాన్న ఇక్కడ ఉంటే బాగుండేది
  • నాన్న హోదాలో వచ్చిన బాబాయ్ కు పాదాభివందనం
  • బాబాయ్ మాటల కోసం మీరంతా ఎదురుచూస్తున్నారని తెలుసు
ఈ ఆనంద సమయంలో నాన్న ఉంటే బాగుండేదని... నాకు తెలిసి నాన్న ఇక్కడే ఎక్కడో ఉండి చూస్తుంటారని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. నాన్న లేకపోయినా నాన్న హోదాలో ఇక్కడకు వచ్చిన బాబాయ్ కు పాదాభివందనం చేస్తున్నానని ఉద్వేగపూరితంగా చెప్పాడు. ఈ విజయానికి మీ ఆశీస్సులు అందజేసినందుకు ధన్యవాదాలు అని అన్నాడు. 'అరవింద సమేత' సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ, ఎన్టీఆర్ ఈ మేరకు వ్యాఖ్యానించాడు.

ఈ సినిమా ఘన విజయం సాధించిన ఆనందాన్ని అభిమానులతోనే కాకుండా, బాబాయ్ తో కూడా పంచుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. ఈ ఫంక్షన్లో ఇంతకన్నా తాను ఎక్కువ మాట్లాడితే బాగోదని... మీరందరూ బాబాయ్ మాటల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపాడు. జోహార్ ఎన్టీఆర్.. జై ఎన్టీఆర్.. జోహార్ హరికృష్ణ... జై హరికృష్ణ అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు. 
balakrishna
ntr
aravinda sametha
tollywood

More Telugu News