ఆర్మీ జవాన్ల కీచక పర్వం.. బధిర మహిళను బ్లాక్ మెయిల్ చేస్తూ నాలుగేళ్లుగా అత్యాచారం!
- మహారాష్ట్రలోని ఖడ్కీ సైనిక ఆసుపత్రిలో ఘటన
- ఎన్జీవో సంస్థ చొరవతో బయటకొచ్చిన వ్యవహారం
- కేసు నమోదుచేసిన పోలీసులు
మహారాష్ట్రలోని పూణేలో ఉన్న ఖడ్కీ మిలటరీ ఆసుపత్రి ఆవరణలో బాధితురాలు ఉంటోంది. ఈ నేపథ్యంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న నలుగురు ఆర్మీ జవాన్లు ఆమెపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఈ దారుణాన్ని ఫోన్ లో వీడియో తీశారు. అనంతరం ఈ వీడియోను బయటపెడతామని బెదిరిస్తూ గత నాలుగేళ్లుగా బాధితురాలిపై ఈ అకృత్యాన్ని కొనసాగిస్తున్నారు. చివరికి ఓ ఎన్జీవో సాయంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అంతేకాకుండా ఈ విషయమై రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్మీ చీఫ్ కు ఎన్జీవో సంస్థ సాయంతో లేఖ కూడా రాసింది. ఈ నేపథ్యంలో నలుగురు ఆర్మీ జవాన్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.