'సైరా' క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణలో చిరూ

  • జార్జియాలో 'సైరా' షూటింగ్ 
  • భారీ పోరాట సన్నివేశాల చిత్రీకరణ 
  • నరసింహా రెడ్డి గురువు పాత్రలో అమితాబ్  
చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' రూపొందుతోంది. బ్రిటిష్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తొలి భారతీయుడు 'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి'గా ఈ సినిమాలో చిరరంజీవి కనిపించనున్నారు. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జార్జియాలో జరుగుతోంది. కొన్ని రోజులుగా అక్కడ ప్రధాన పాత్రధారులంతా పాల్గొనగా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తూ వస్తున్నారు.

ప్రస్తుతం అక్కడ క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరిగుతోంది. హాలీవుడ్ స్థాయిలో ఈ సన్నివేశాలను చిత్రీకరించడం కోసం భారీస్థాయిలో ఖర్చు చేస్తున్నారు. ఆంగ్లేయ సైన్యంపై నరసింహా రెడ్డి .. ఆయన అనుచర గణం విరుచుకుపడటం చిత్రీకరిస్తున్నారు. ఈ పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేస్తాయనీ, సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గురువు గోసాయి వెంకన్నగా అమితాబ్ నటిస్తుండగా, ఇతర ముఖ్య పాత్రల్లో జగపతిబాబు .. విజయ్ సేతుపతి .. సుదీప్ కనిపించనున్నారు.      
Go Back to Shorts
chiranjeevi
nayanatara

More Telugu News