ప్రజలను ఇబ్బందులు పెట్టిందంటూ రవీనా టాండన్ పై కోర్టుకెక్కిన న్యాయవాది!
- 12న ముజఫర్ పూర్ నగరంలో పర్యటించిన రవీనా
- ఓ హోటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన నటి
- ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడిందంటూ కోర్టులో పిటిషన్
రవీనాతో పాటు హోటల్ యజమానులు ప్రణవ్ కుమార్, ఉమేష్ సింగ్ లనూ కేసులో నిందితులుగా పేర్కొన్నారు. అనుమతి లేకుండా సమావేశాలు జరపడం, ప్రజా జీవనానికి విఘాతం కలిగించడం తదితర అభియోగాలు మోపుతూ ఐపీసీలోని పలు సెక్షన్లను ఆయన ఉదహరించారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు తదుపరి వాదనలను నవంబర్ 2కు వాయిదా వేసింది.