చమురు కంపెనీలకు నరేంద్ర మోదీ విన్నపం... అంత సీను లేదన్న సౌదీ అరేబియా!
- నానాటికీ పెరుగుతున్న ఇంధన ధరలు
- చెల్లింపులను స్థానిక కరెన్సీలో తీసుకోవాలని మోదీ సూచన
- అది కుదిరే పని కాదన్న సౌదీ అరేబియా
కాగా, డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయికి పతనంకాగా, ఇతర దేశాల కరెన్సీల విలువ కూడా క్షీణిస్తున్న సంగతి తెలిసిందే. చమురు దిగుమతి చేసుకునే దేశాలు జరిపే చెల్లింపులు డాలర్లలో కాకుండా, ఆయా దేశాల స్థానిక కరెన్సీ రూపంలో తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన సౌదీ, చెల్లింపులను ఆయా దేశాల కరెన్సీల రూపంలో తీసుకోవాలన్న ఆలోచన తమకు ఏ మాత్రం లేదని, ఏదైనా చమురు ఉత్పత్తి దేశం అందుకు అంగీకరిస్తే తమకు అభ్యంతరం లేదని వెల్లడించింది.