త్రివిక్రమ్ ఫ్యాక్షనిజాన్ని రెచ్చగొట్టాడు.. సీన్లను తొలగించకుంటే థియేటర్లలో ‘అరవింద సమేత’ను అడ్డుకుంటాం!: సీమ సంఘాల వార్నింగ్
- సీమపై టాలీవుడ్ కక్ష కట్టింది
- అభ్యంతరకరమైన సీన్లను తొలగించాలి
- సీమ ప్రజలకు త్రివిక్రమ్ క్షమాపణ చెప్పాలి
త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమాలో రాయలసీమకు సంబంధించి పలు అభ్యంతరకరమైన సీన్లు, మాటలు ఉన్నాయని నేతలు ఆరోపించారు. ఇలాంటి సినిమాను తీసినందుకు త్రివిక్రమ్ సీమ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అరవింద సమేత వీరరాఘవ సినిమాలో ఫ్యాక్షన్ సన్నివేశాలు యువతను తప్పుదారి పట్టించేలా ఉన్నాయన్నారు. ఇప్పటికైనా సినిమాలోని ఈ సన్నివేశాలను తొలగించాలనీ, లేదంటే రాయలసీమలో అరవింద సమేత వీరరాఘవ ప్రదర్శనలను అడ్డుకుంటామని నేతలు హెచ్చరించారు.