ఎన్టీఆర్ వస్తే లోకేశ్ కు పోటీ అని చంద్రబాబుకు భయం: లక్ష్మీ పార్వతి
- టీడీపీ కార్యకర్తల్లో ఎన్టీఆర్ కు ఫాలోయింగ్
- ఆయనకు పార్టీ పదవి ఇస్తే ప్రతి ఒక్కరి మద్దతు
- కుమారుడు సైడ్ అవుతాడని చంద్రబాబు భయం
లోకేశ్ కు పోటీ వస్తాడన్న ఆలోచనతోనే ఎన్టీఆర్ ను తెరపైకి తేవడం లేదని ఆరోపించిన ఆమె, ఇప్పటికే ఓ నటుడిగా, వక్తగా ఎన్టీఆర్ నిరూపించుకున్నాడని అన్నారు. ఎన్టీఆర్ కు పార్టీ పదవి ఇస్తే, మొత్తం టీడీపీ నేతలంతా మద్దతిస్తారని తాను భావిస్తున్నానని, అయితే, అది జరిగే పరిస్థితులు మాత్రం తనకు కనిపించట్లేదని అన్నారు.