ఉత్తమ్, జానారెడ్డిల గోచీలు ఊడిపోయే పరిస్థితి ఉంది: సీఎం కేసీఆర్

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రాబోయేది టీఆర్ఎస్సేనని సీఎం కేసీఆర్ మరోసారి ధీమా వ్యక్తం చేశారు. నల్గొండలో ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ, నిన్ననే వచ్చిన తాజా సర్వేలో 119 నియోజకవర్గాల్లో 110 స్థానాల్లో టీఆర్ఎస్, 7 స్థానాల్లో మజ్లిస్ పార్టీ విజయం సాధిస్తుందని వెల్లడైందని అన్నారు. నల్గొండ జిల్లాలోని మొత్తం 12 స్థానాల్లో గులాబీ జెండా ఎగురనుందని ఈ సర్వేలో వెల్లడైందని, తనకు చాలా సంతోషంగా ఉందని  అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి గోచీలు ఊడిపోయే పరిస్థితి ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చైతన్యవంతులైన నల్గొండ జిల్లా ప్రజలు, మిగతా తెలంగాణ ప్రజలకు మార్గదర్శకం కావాలని, అన్ని రకాల మనం బాగుపడాలన్న, ఈ ప్రగతి రథచక్రం ఆగొద్దన్నా టీఆర్ఎస్ నే మళ్లీ గెలిపించాలని కోరారు.
Go Back to Shorts
kcr
Uttam Kumar Reddy
janareddy

More Telugu News