కార్గిల్ యుద్ధ వీరుడు కల్నల్ సోనమ్ వాంగ్‌చుక్ కన్నుమూత

Sonam Wangchuk Kargil War Hero Colonel Sonam Wangchuk Passes Away
షార్ట్స్‌లో చూడండి
1999 కార్గిల్ యుద్ధంలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి, దేశ రెండో అత్యున్నత సైనిక పురస్కారం 'మహావీర చక్ర' అందుకున్న కల్నల్ సోనమ్ వాంగ్‌చుక్ (రిటైర్డ్) శుక్రవారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, భారత సైన్యం సంతాపం ప్రకటించాయి. లద్దాఖ్ గడ్డపై పుట్టిన వీరుడంటూ ఆయన సేవలను కొనియాడారు.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎక్స్ వేదికగా నివాళులు అర్పించారు. "కల్నల్ వాంగ్‌చుక్ లద్దాఖ్ గర్వించదగ్గ పుత్రుడు. అత్యంత క్లిష్టమైన ఎత్తైన ప్రదేశాల్లో జరిగిన 'ఆపరేషన్ విజయ్' సమయంలో ఆయన చూపిన హీరోయిజం, సైనికులకు స్ఫూర్తినిచ్చింది. ఆయన జీవితం ధైర్యానికి, త్యాగానికి, జాతీయ సమైక్యతకు నిదర్శనం" అని పేర్కొన్నారు. ఆయన వారసత్వం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు.

భారత సైన్యం కూడా కల్నల్ వాంగ్‌చుక్‌కు ఘనంగా నివాళులు అర్పించింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. 1999 మే 30న బటాలిక్ సెక్టార్‌లో సుమారు 5,500 మీటర్ల ఎత్తులో ఉన్న శిఖరాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో, తన బృందానికి వాంగ్‌చుక్ నాయకత్వం వహించారు. శత్రువులు అకస్మాత్తుగా దాడి చేయగా, ఒక సైనికుడు ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ, ధైర్యం కోల్పోని వాంగ్‌చుక్, ప్రతిదాడికి దిగి ఇద్దరు శత్రు సైనికులను హతమార్చారు. వారి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ అసమాన ధైర్యసాహసాలకు గాను ఆయనకు మహావీర చక్ర లభించింది. ఆయన మృతితో దేశవ్యాప్తంగా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Go Back to Shorts
Sonam Wangchuk
Kargil War
Maha Vir Chakra
Colonel Sonam Wangchuk
Indian Army
Operation Vijay
Ladakh
Defence Minister Rajnath Singh
Batallik Sector

More Telugu News