Madhya Pradesh: దేవుడి ముందే దారుణం.. గుడిలో మైనర్ బాలికపై ఇద్దరు పూజారుల అత్యాచారం!

  • మధ్యప్రదేశ్ లోని దాతియాలో ఘటన
  • మిఠాయి ఆశచూపి చిన్నారిపై దారుణం
  • నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
ఓ చిన్నారిపై కన్నేసిన ఇద్దరు నీచులు ఆమెపై మిఠాయిల ఆశ చూపారు. అనంతరం ఆలయంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని మిఠాయిలు ఇచ్చి ఇంటి దగ్గర దిగబెట్టారు. అయితే బాలిక నొప్పితో బాధపడటంతో తల్లిదండ్రులు ఆరా తీయగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

మధ్యప్రదేశ్ లోని దాతియా జిల్లాలో ఓ బాలిక(5)పై ఊరిలోని గుడి పూజారులు రాజు పండిత్(55), బతోలీ ప్రజాపతి(45) కన్నేశారు. మిఠాయిలు కొనిస్తామని ఆశ చూపి ఆలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం అత్యాచారం చేశారు. ఈ ఘటన తర్వాత బాధితురాలు ఏడుస్తూ ఉండటంతో మిఠాయిలు కొనిచ్చి ఇంటి వద్ద దించారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించారు. అయితే బాలిక మాత్రం నొప్పితో విలవిల్లాడుతూ ఉండటంతో తల్లి ప్రశ్నించింది. దీంతో అసలు విషయాన్ని బాలిక బయటపెట్టింది.

దీంతో వెంటనే చిన్నారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. దుండగులు కేవలం ఈ చిన్నారినే కాకుండా ఇంకొంతమంది బాలికలపై కూడా అఘాయిత్యానికి పాల్పడ్డారా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 12 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసు మహిళలపై అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష విధించే చట్టాన్ని గతేడాది డిసెంబర్ లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ గత ఏడు నెలల్లో 12 మంది దోషులకు కోర్టులు మరణదండన విధించాయి.
Madhya Pradesh
rape
minor girl
priests
temples
sweet
lured

More Telugu News