తెలంగాణలో ఈ నెల 22 నుంచి ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె

Telangana RTC Employees Strike From 22nd
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 22వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు వెళుతున్నట్లు తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. గత నెల 13వ తేదీన యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చినట్లు తెలిపింది. కానీ యాజమాన్యం నుంచి ఎలాంటి హామీ రాలేదని వెల్లడించింది. ప్రభుత్వం, యాజమాన్యం ముందు తాము 32 డిమాండ్లను ఉంచామని పేర్కొంది.

ఈ మేరకు ఆర్టీసీ జేఏసీ వైస్ ఛైర్మన్ థామస్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే సమ్మె నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె నుంచి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇవ్వాలని పలు డిమాండ్లు యాజమాన్యం ముందు ఉంచినట్లు తెలిపారు.
Go Back to Shorts
Telangana RTC
RTC Strike
Telangana RTC Strike
RTC JAC
Thomas Reddy
Telangana News
Bus Strike

More Telugu News