నవాబ్ ఎఫెక్ట్.. శరీరానికి కొక్కేలు గుచ్చుకుని వేలాడుతూ శింబు పోస్టర్ కు అభిమాని పాలాభిషేకం!
- హిట్ టాక్ తెచ్చుకున్న నవాబ్ సినిమా
- శరీరాన్ని హింసించుకున్న శింబు అభిమాని
- తమిళనాడు రాజధాని చెన్నైలో ఘటన
అయితే చెన్నైలో ఓ అభిమాని మాత్రం శింబుకు హిట్ రావడాన్ని విచిత్రంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. క్రేన్ కొక్కేలను శరీరానికి గుచ్చుకున్న ఓ శింబు అభిమాని.. గాల్లోకి లేచి 25 అడుగుల ఎత్తు ఉన్న శింబు పోస్టర్ కు పాలాభిషేకం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, సదరు అభిమాని చర్యను చాలామంది నెటిజన్లు తప్పుపడుతున్నారు.