నా 27 సినిమాల్లో ఎన్నడూ తండ్రి చితికి నిప్పు పెట్టలేదు: పెల్లుబుకుతున్న కన్నీటితో ఎన్టీఆర్
Add ap7am to your home Screen

నా 27 సినిమాల్లో ఎన్నడూ తండ్రి చితికి నిప్పు పెట్టలేదు: పెల్లుబుకుతున్న కన్నీటితో ఎన్టీఆర్

  • మనం అనుకునేది ఒకటైతే, పైవాడు రాసేది మరొకటి
  • కష్టకాలంలో అండగా నిలిచిన త్రివిక్రమ్
  • 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్
"ఇది నా 28వ చిత్రం. గత 27 చిత్రాల్లో ఎప్పుడూ తండ్రి చితికి నిప్పంటించే పాత్రలను ఏ దర్శకుడూ నాకు ఇవ్వలేదు. కానీ, ఈ సినిమాలో యాధృచ్చికమో ఏమో... మనం అనుకునేది ఒకటైతే, పైవాడు రాసేది మరొకటి" అని ఎన్టీఆర్ భావోద్వేగంతో మాట్లాడాడు.

నిన్న రాత్రి హైదరాబాద్ లో 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా తాను ప్రసంగించిన పావుగంట వ్యవధిలో ఎన్టీఆర్ కళ్లు పలుమార్లు చమర్చాయి. గత నెల రోజులుగా తనకు అన్నలా, తండ్రిలా, స్నేహితుడిలా త్రివిక్రమ్ శ్రీనివాస్ తోడున్నాడని, తమ ఇద్దరి బంధాన్ని తన తండ్రి చూస్తున్నారని వ్యాఖ్యానించాడు.

ఈ సినిమాకి సంగీత దర్శకుడు తమన్‌ ప్రాణం పెట్టాడని, మాస్ హీరో ఎన్టీఆర్‌ సినిమాలో డ్యాన్సులుండే పాటలు లేవేంటి? అని ప్రశ్నించిన కొందరికి సినిమానే సమాధానం ఇస్తుందని చెప్పాడు. "ఒక గొప్ప చిత్రాన్ని నాకు ఇచ్చి, జీవితం విలువ తెలిసేంత పరిపక్వత రావడానికే దేవుడు ఇప్పుడు త్రివిక్రమ్‌ తో ఈ సినిమా చేయించాడేమో" అని అన్నాడు. తనకు త్రివిక్రమ్ 12 సంవత్సరాలుగా తెలుసునని, ఆయనలో ఇంతకాలం ఓ స్నేహితుడిని, దర్శకుడిని చూశానని, ఈ సినిమా సందర్భంగా ఆయనలో ఓ ఆత్మబంధువుని చూశానని తెలిపాడు.
NTR
Aravainda Sameta
Pre Release Event
Trivikram

More Telugu News