ఈ గెలుపు కౌశల్ ది కాదు... బిగ్ బాస్ పై రచయిత కోన వెంకట్ స్పందన!
- నిన్నటితో ముగిసిన బిగ్ బాస్-2
- విజేతగా నిలిచిన కౌశల్
- కౌశల్ కు మద్దతిచ్చిన అభిమానులదే గెలుపు
- ట్విట్టర్ లో కోన వెంకట్
ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేస్తూ, నిజాయితీకి ప్రజలిచ్చిన స్పందనకు కౌశల్ గెలుపు ఓ మంచి ఉదాహరణని అభివర్ణించాడు. నిజాయతీ కలిగుంటే, ప్రజలు మద్దతిస్తారన్న విషయం మరోసారి నిరూపితమైందని, ఇంతటి ప్రజాభిమానానికి కౌశల్ అర్హుడేనని చెప్పాడు. బిగ్బాస్ - 2 గెలుపు కౌశల్ ఆర్మీదేనని పేర్కొన్నాడు. ఇక కౌన వెంకట్ ట్వీట్ ను చూసిన ఫ్యాన్స్, కౌశల్ తో ఓ సినిమా ప్లాన్ చేసుకోవాలని కోరుతుండటం గమనార్హం.