కేంద్రం చేసిన మోసంపై ధర్మ పోరాట దీక్ష.. ముస్తాబయిన తాడేపల్లిగూడెం!
- 2 లక్షల మందికి పైగా హాజరవుతారని అంచనా
- ఏర్పాట్లను పూర్తిచేసిన అధికారులు
- వేదికకు అల్లూరి సీతారామరాజు పేరు
ఈ సభకు దాదాపు 2 లక్షల మంది ప్రజలు హాజరుకావొచ్చన్న అంచనాల నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు టీడీపీ సీనియర్ నేతలు హాజరుకానున్నారు. సీఎం సహా 150 మంది అతిథులు ఆసీనులయ్యేలా భారీ వేదికను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ వేదికకు మన్యం వీరుడు ‘అల్లూరి సీతారామరాజు వేదిక’గా నామకరణం చేశారు. సభా ప్రాంగణంలో ఉదయం 11 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు మొదలవుతాయి.
ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు సభ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యాహ్నం 2.30 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు సభ ముగుస్తుంది. ధర్మ పోరాట దీక్ష సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. జిల్లాలోని 15 నియోజకవర్గాల నుంచి 20,000 వాహనాల్లో ప్రజలు ధర్మ పోరాట దీక్షా స్థలికి చేరుకుంటారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.