అలా అయితే జగన్ సీఎం.. ముఖేశ్ అంబానీ పీఎం అయ్యేవారు: పవన్ కల్యాణ్
- గెలవడానికి డబ్బు కాదు ప్రజాబలం కావాలి
- ఓట్లు చీలిపోకూడదనే టీడీపీకి మద్దతిచ్చా
- నేను లోకేశ్‌లా ఆలోచించను
గత ఎన్నికల్లో తాను పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయన్న ఉద్దేశంతోనే టీడీపీకి మద్దతు ఇచ్చానని పవన్ చెప్పారు. కానీ తాను అనుకున్నది ఒకటి, అయింది మరొకటని అన్నారు. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్నారని, సీఎంగా తొమ్మిదేళ్లు శాంతిభద్రతలను కాపాడారనే ఉద్దేశంతోనే చంద్రబాబుకు మద్దతు ఇచ్చినట్టు చెప్పారు. లోకేశ్‌లా తండ్రిని కేంద్రానికి పంపించి, తాను ముఖ్యమంత్రిని అయిపోవాలనుకోవడం లేదని పవన్ వ్యంగ్యంగా అన్నారు.