‘పోలవరం’ నుంచి అన్న క్యాంటీన్ వరకూ అంతా అవినీతే!: ఉండవల్లి ఆరోపణలు

  • ‘పోలవరం’ అవినీతిపై కాగ్ నివేదిక బయటపెట్టింది
  • దీనిపై చంద్రబాబు సమాధానం చెప్పాలి
  • 2019లో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాదు
పోలవరం ప్రాజెక్టు నుంచి అన్న క్యాంటీన్ వరకూ అంతా అవినీతేనని ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘పోలవరం’ అవినీతి గురించి కాగ్ నివేదికలో బయటపెట్టిన దానిపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ముఖ్యమైన పనులు ఇంకా పూర్తి కాలేదని, 2019లో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం జరిగే పని కాదని కాగ్ నివేదికలో పేర్కొన్న విషయాన్ని ఉండవల్లి ప్రస్తావించారు. అన్న క్యాంటీన్లకు సంబంధించి అంతా అవినీతేనని, 'ఆదరణ పథకం' కూడా లొసుగుల మయమని ఆరోపించారు.
Go Back to Shorts
Chandrababu
Undavalli

More Telugu News