గొడవ పడుతున్న భార్యకు ముద్దివ్వాలని చూస్తే... నాలుక కొరికేసింది!
- న్యూఢిల్లీలోని రహణోలా ప్రాంతంలో ఘటన
- ఆర్టిస్టుగా పనిచేస్తున్న కరణ్
- నాలుక తెగిపోవడంతో మాట్లాడే స్థితిలో లేని కరణ్
ఈ క్రమంలో రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన భర్త కరణ్ తో అతని భార్య గొడవ పెట్టుకుంది. ఈ సమయంలో భార్య కోపాన్ని చల్లార్చేందుకు ఓ లిప్ కిస్ ఇచ్చాడు కిరణ్. అప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్న భార్య, అతని నాలుకను కొరికేసింది. నాలుక తెగిపోవడంతో సఫ్టర్ జంగ్ ఆసుపత్రికి పరుగులు పెట్టాడు. కరణ్ నాలుకకు వైద్యులు శస్త్రచికిత్స చేయగా, ప్రస్తుతం అతను మాట్లాడలేకపోతున్నాడు. అతని ఫిర్యాదు మేరకు భార్యపై ఐపీసీ సెక్షన్ 326 కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.