'ఎన్టీఆర్' ఓవర్సీస్ రైట్స్ కి భారీ రేటు
Add ap7am to your home Screen

'ఎన్టీఆర్' ఓవర్సీస్ రైట్స్ కి భారీ రేటు

  • షూటింగు దశలో 'ఎన్టీఆర్'
  • ముఖ్యపాత్రల్లో భారీతారాగణం 
  • బిజినెస్ పరంగా పెరుగుతోన్న డిమాండ్  
క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' బయోపిక్ రూపొందుతోంది. ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటిస్తోన్న ఈ సినిమాలో చంద్రబాబునాయుడుగా రానా .. అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్ నటించారు. ఇక శ్రీదేవి పాత్రకి గాను రకుల్ ప్రీత్ ను తీసుకోగా, ఎస్వీఆర్ పాత్ర కోసం నాగబాబును తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ సినీరంగ ప్రయాణం .. రాజకీయ ప్రవేశానికి సంబంధించిన కంటెంట్ తో ఈ సినిమా రూపొందుతుండటం వలన అందరిలోను ఆసక్తి వుంది.

ఈ సినిమాలోని ముఖ్యమైన పాత్రలను మంచి క్రేజ్ వున్న నటీనటులు పోషిస్తూ ఉండటం వలన మరింత డిమాండ్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ను దక్కించుకోవడానికి చాలామంది ఉత్సాహాన్ని చూపుతున్నారట. ఒక ప్రముఖ సంస్థ ఓవర్సీస్ రైట్స్ నిమిత్తం 10 కోట్ల వరకూ ఆఫర్ చేసిందట. అయితే సినిమాకి గల క్రేజ్ ను బట్టి ఓవర్సీస్ రైట్స్ 12 కోట్లకు తగ్గకుండా ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్మాతలు వున్నట్టుగా సమాచారం. ఓవర్సీస్ నిమిత్తం ఈ స్థాయి రేటు చెప్పడం బాలకృష్ణ కెరియర్లో ఇదే మొదటిసారి అని చెబుతున్నారు.     
balakrishna
raana
sumanth

More Telugu News