అప్పటి నుంచే టీఆర్ఎస్ పార్టీ మాట మార్చింది!: చంద్రబాబు

  • తెలుగు జాతి కోసం కలసి ఉందామని చెప్పా
  • ఏపీకి ప్రత్యేక హోదాకు అనుకూలమని టీఆర్ఎస్ ఎంపీలు చెప్పారు
  • మోదీతో విభేదించాక... టీఆర్ఎస్ మాట మార్చింది
తెలుగు జాతి కోసం కలసి ఉందామని టీఆర్ఎస్ కు తాను ఎన్నోసార్లు చెప్పానని చంద్రబాబు అన్నారు. జరిగిందేదో జరిగిపోయిందని, తెలుగు ప్రజల కోసం కలసి ముందుకు వెళదామని తాను చెప్పానని, రెండు రాష్ట్రాలను కలసి అభివృద్ధి చేసుకుందామని ఎన్నోసార్లు చెప్పానని అన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం టీఆర్ఎస్ తొలుత సహకరించిందని, ప్రత్యేక హోదాకు తాము అనుకూలమే అని ఆ పార్టీ ఎంపీలు పార్లమెంటులో కూడా చెప్పారని గుర్తు చేశారు. కానీ, ఎప్పుడైతే ప్రధాని మోదీతో తాము విభేదించామో, అప్పటి నుంచి టీఆర్ఎస్ తమతో విభేదించడం మొదలు పెట్టిందని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పిన టీఆర్ఎస్... ఆ తర్వాత మాట మార్చిందని అన్నారు. అసెంబ్లీలో మాట్లాడుతూ, చంద్రబాబు ఈ మేరకు వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
TRS
Chandrababu
special status

More Telugu News