సంక్రాంతికి చిరూ .. కొరటాల సినిమా లాంచ్?

  • చిరంజీవితో కొరటాల మూవీ 
  • స్క్రిప్ట్ పై కొరటాల కసరత్తు 
  • బ్యానర్ పై రావలసిన క్లారిటీ  
తెలుగు చిత్రపరిశ్రమలో రాజమౌళి తరువాత అపజయాలు ఎరుగని దర్శకుడిగా కొరటాల శివ పేరు వినిపిస్తుంది. యూత్ .. మాస్ .. ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే అంశాలతో కథలను సిద్ధం చేసుకోవడం ఆయన ప్రత్యేకత. వినోదానికి సందేశాన్ని జోడిస్తూ వరుస విజయాలను అందుకుంటున్న కొరటాల శివ, తన తదుపరి సినిమాను చిరంజీవితో చేయనున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. భారీ బడ్జెట్ తో రూపొందే ఈ సినిమాను సంక్రాంతికి లాంచ్ చేయాలనే నిర్ణయానికి చిరూ .. కొరటాల వచ్చినట్టుగా తాజా సమాచారం. సంక్రాంతికి పూజా కార్యక్రమాలను నిర్వహించి, ఆ తరువాత రెగ్యులర్ షూటింగును మొదలుపెడతారట. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పై కొరటాల కసరత్తు చేస్తూనే, నటీనటుల జాబితాను సిద్ధం చేసుకుంటున్నట్టుగా సమాచారం. ఈ సినిమాకి నిర్మాతగా చరణ్ వ్యవహరిస్తాడా? లేదంటే వేరే బ్యానర్ పై చేస్తారా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది.  
Go Back to Shorts
chiranjeevi
koratala

More Telugu News