సరిగ్గా 25 సంవత్సరాల క్రితం బాలయ్య సృష్టించిన రికార్డు... నేటికీ చెక్కు చెదరలేదు!
Add ap7am to your home Screen

సరిగ్గా 25 సంవత్సరాల క్రితం బాలయ్య సృష్టించిన రికార్డు... నేటికీ చెక్కు చెదరలేదు!

  • 1993 సెప్టెంబర్ 3న రెండు చిత్రాల విడుదల
  • వెండి తెరలను తాకిన నిప్పురవ్వ, బంగారు బుల్లోడు
  • మళ్లీ అటువంటి రికార్డును అందుకోని తెలుగు హీరో
అది, 1993 సెప్టెంబర్ 3... ఆ రోజుకు తెలుగు చలనచిత్ర చరిత్రలో ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఓ టాప్ హీరో నటించిన రెండు చిత్రాలు ఒకే రోజున విడుదలయ్యాయి. నందమూరి నటసింహం నటించిన 'నిప్పురవ్వ', 'బంగారు బుల్లోడు' సినిమాలు విడుదలయ్యాయి. నిప్పురవ్వ ఫ్లాప్ కాగా, బంగారు బుల్లోడు కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే, ఆ రోజుల్లోనే తొలి రోజు కలెక్షన్స్ రూ. 2 కోట్లను దాటిన రికార్డును నిప్పురవ్వ సృష్టించింది.

ఇక రాజమండ్రిలో డైరెక్టుగా రెండు చిత్రాలూ శతదినోత్సవాన్ని జరుపుకున్నాయి. ఓ పెద్ద హీరో నటించిన రెండు చిత్రాలు ఆ తరువాత ఒకేరోజు విడుదలైన దాఖలాలు ఇప్పటికీ లేవు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో నిప్పురవ్వ, రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో బంగారు బుల్లోడు తెరకెక్కాయి. నిప్పురవ్వలో విజయశాంతి, బంగారు బుల్లోడు రమ్యకృష్ణ, రవీనా టాండన్ లు బాలయ్యతో ఆడిపాడారు. ఈ రెండు చిత్రాలకూ ఇది రజతోత్సవ సంవత్సరం కాగా, పాతికేళ్లయినా బాలయ్య సృష్టించిన రికార్డు చెక్కు చెదరలేదు. ఇకపై మరో పెద్ధ హీరో సోలోగా చేసిన రెండు చిత్రాలు ఒకేరోజు విడుదలవుతాయని భావించడం కూడా అత్యాశేనేమో!
Nippuravv
Balakrishna
Bangaru bullodu

More Telugu News