పవన్ కల్యాణ్ కు రామ్ చరణ్ ఇచ్చిన వీడియో గిఫ్ట్ ఇదిగో!
Add ap7am to your home Screen

పవన్ కల్యాణ్ కు రామ్ చరణ్ ఇచ్చిన వీడియో గిఫ్ట్ ఇదిగో!

  • పారాగ్లైడింగ్ చేసిన రామ్ చరణ్
  • బాబాయ్ కు అంకితం
  • తనకు స్ఫూర్తి మీరేనంటూ కితాబు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పుట్టినరోజు సందర్భంగా యంగ్ హీరో రామ్ చరణ్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపాడు. బాబాయ్ కి అద్భుతమైన బహుమతిని అందించాడు. ఎంతో సాహసంతో కూడిన పారాగ్లైడింగ్ చేసి, దాన్ని తన బాబాయ్ కి పుట్టినరోజు సందర్భంగా అంకితం చేశాడు.

ఈ వీడియోను ఆయన భార్య ఉపాసన తన సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేశారు. ఈ సందర్భంగా, 'ప్రియమైన బాబాయ్, నా జీవితంలో కాని, సినిమాల్లో కాని సాహసాలు చేసే స్ఫూర్తిని, ధైర్యాన్ని నాకు మీరే ఇచ్చారు. ఈ సాహసం మీ కోసమే. కొందరి సాయంతో ఈ సాహసాన్ని చేశాను. పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు నాకు ఇస్తున్న స్ఫూర్తి ఇలాగే కొనసాగాలి' అంటూ ట్వీట్ చేశాడు.
Pawan Kalyan
Ramcharan
upasana
para gliding

More Telugu News