బాబాయ్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ కు గిఫ్ట్ ఇవ్వనున్న రామ్ చరణ్!
- సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టిన రోజు
- కొత్త చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేసే ఆలోచనలో రామ్ చరణ్
- బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం
సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజుకాగా, ఆరోజు తన కొత్త చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ లను విడుదల చేయాలని చెర్రీ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనిద్వారా మెగా ఫ్యాన్స్ ఆనందం రెట్టింపవుతుందని రామ్ చరణ్ భావిస్తున్నాడు. కాగా, చెర్రీ కొత్త చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్ కాగా, కీలక పాత్రలో ఆర్యన్ రాజేష్, విలన్ గా వివేక్ ఓబరాయ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.