'సైరా' సెట్ కు వెళ్లి చిరంజీవికి సర్ ప్రయిజ్ ఇచ్చిన బాలయ్య!
Add ap7am to your home Screen

'సైరా' సెట్ కు వెళ్లి చిరంజీవికి సర్ ప్రయిజ్ ఇచ్చిన బాలయ్య!

  • 'సైరా' షూటింగ్ లో బిజీగా చిరంజీవి
  • హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్
  • అక్కడికి వెళ్లి సర్ ప్రయిజ్ ఇచ్చిన బాలయ్య
మెగాస్టార్ చిరంజీవి తన తాజా చిత్రం 'సైరా' షూటింగ్ లో బిజీగా ఉండగా, సెట్లోకి వచ్చిన హీరో బాలకృష్ణ కాసేపు సందడి చేశారు. బాక్సాఫీసు వద్ద పోటీ పడే విషయంలో సుదీర్ఘకాల ప్రత్యర్ధులైన వీరిద్దరూ, వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి అందరికీ తెలిసిందే. హైదరాబాద్ లో 'సైరా' షూటింగ్ జరుగుతూ ఉండగా, బాలయ్య అక్కడికి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారట.

చిరంజీవిని, చిత్ర టీమ్ ను అభినందించిన బాలయ్య, చిత్రం బాగా రావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. వీరిద్దరూ సెట్స్ లో చాలా సేపు ముచ్చట్లాడుతూ కూర్చున్నారని తెలుస్తుండగా, ఈ కలయికకు సంబంధించిన చిత్రాలు బయటకు రాలేదు. కాగా, 'సైరా' సెట్ కు పవన్ కల్యాణ్ వెళ్లిన వేళ, తీసిన చిత్రాలు తాజాగా బయటకు వచ్చి వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
Chiranjeevi
Sairaa
Balakrishna
Shooting

More Telugu News