అన్నయ్యకు రాఖీ: చెల్లెళ్లను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్న చిరంజీవి.. వీడియో చూడండి

  • చిరంజీవి ఇంట్లో రక్షాబంధన్ వేడుకలు
  • చిరుకు రాఖీలు కట్టిన మాధవి, విజయ
  • ఆశీర్వదించి, కానుకలు ఇచ్చిన అన్నయ్య
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చిరంజీవికి ఆయన చెల్లెళ్లు మాధవి, విజయలు రాఖీ కట్టారు. సంప్రదాయ బద్ధంగా తమ అన్నయ్యకు హారతి ఇచ్చి, మిఠాయి తినిపించారు. అనంతరం ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా తన చెల్లెళ్లకు చిరంజీవి కానుకలు ఇచ్చారు. తన తోబుట్టువులను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని, హత్తుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను చిరు కోడలు ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'ప్రియమైన సోదరీమణులతో మామయ్య రక్షాబంధన్ వేడుకలు' అంటూ ఉపాసన పేర్కొన్నారు.

Chiranjeevi
raksha bandhan
tollywood

More Telugu News