ఫ్లూట్ వాయించి ర్యాగింగ్ నుంచి తప్పించుకున్నా!: ఎస్పీ బాలు ఇంజనీరింగ్ అనుభవాలు
- అనంతపురం జేఎన్టీయూలో చేరిన బాలు
- కేవలం 8 నెలలే సాగిన చదువు
- సీనియర్లు వదిలేసేవారని వెల్లడి
సంగీత నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టిన తనకు అనంతపురం జేఎన్టీయూలో ఇంజనీరింగ్ సీటు వచ్చిందని బాలు తెలిపారు. అయితే తానక్కడ కేవలం 8 నెలలే చదువుకున్నానని వెల్లడించారు. అప్పట్లో అక్కడ ర్యాగింగ్ బాగా జరిగేదనీ, దాని నుంచి తప్పించుకునేందుకు సంగీతం ఉపయోగపడిందని చెప్పారు.
‘‘నేను కాలేజీలో పాటలు పాడేవాడిని. దీంతో పాటు కొద్దోగొప్పో ఫ్లూట్ వాయించేవాడిని. దీంతో సీనియర్లు ‘వాడిని వదిలేయండిరా’ అని అనేవారు. కాలేజీలో నాకు ఇంకో ఇద్దరు తోడయ్యారు. వారిలో ఒకరు తబలా, ఇంకొకరు బ్యాంజో వాయించేవాళ్లు. దీంతో ఓ చిన్న సంగీత బృందాన్ని ఏర్పాటు చేసుకుని ప్రాక్టీస్ చేసేవాళ్లం. అలా కాలేజీలో జరిగే ర్యాగింగ్ బారి నుంచి తప్పించుకున్నాం’’ అని తన మధుర స్మృతులను గుర్తుచేసుకున్నారు.