టీడీపీ ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటుంది.. బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే మా లక్ష్యం: సోమిరెడ్డి
- కాంగ్రెస్ తో టీడీపీకి సంబంధాలు లేవు
- కేసుల మాఫీ కోసం బీజేపీతో వైసీపీ కుమ్మక్కయింది
- స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడుతోంది
రానున్న ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా చూడటమే టీడీపీ లక్ష్యమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో టీడీపీకి సంబంధాలు లేవని... కాంగ్రెస్ లో పుట్టి పెరిగిన జగన్ కే ఆ పార్టీతో సంబంధాలు ఉన్నాయని తెలిపారు. కేసులను మాఫీ చేయించుకునేందుకు బీజేపీతో జగన్ కుమ్మక్కయ్యారని విమర్శించారు. ఎన్ని యాత్రలు చేసినా వైసీపీ అధికారంలోకి రావడం అసంభవమని చెప్పారు.