సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Add ap7am to your home Screen

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • స్పెషల్ సాంగ్స్ గురించి తమన్నా! 
  • పవన కల్యాణ్ సినిమా రీమేక్ లో శింబు
  • 'ఎన్టీఆర్' షూటింగులో రానా   
*  'డ్యాన్స్ కి సంబంధించిన కొత్త విషయాలని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వుంటాను' అంటోంది మిల్కీ వైట్ భామ తమన్నా. 'నేను చేసిన చిత్రాలలో డ్యాన్సుల ప్రాధాన్యత వున్నవే ఎక్కువ. అందుకే షూటింగులో వాటిని బాగా ఎంజాయ్ చేస్తాను. అలాగే డ్యాన్సుల గురించి ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకుంటూ వాటి మీద దృష్టి పెడుతుంటాను. ఒకవిధంగా స్పెషల్ సాంగ్స్ కూడా అందుకే చేయగలుగుతున్నాను' అని చెప్పింది.
*  పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రాన్ని తమిళంలో లైకా ప్రొడక్షన్స్ రీమేక్ చేస్తోంది. సుందర్ సి దర్శకత్వం వహించే ఈ చిత్రంలో పవన్ పాత్రను శింబు పోషిస్తున్నాడు.  
*  రానా దగ్గుబాటి 'ఎన్టీఆర్' బయోపిక్ షూటింగులో జాయిన్ అయ్యాడు. ఈ సినిమాలో ఆయన చంద్రబాబు నాయుడి పాత్రను పోషిస్తున్న సంగతి విదితమే. ఇందుకోసం ఇటీవల చంద్రబాబుని కూడా కలసి ఆయన సలహాలు తీసుకున్నాడు.
Thamanna
Pavan
Trivikram
Rana
NTR

More Telugu News