చంద్రబాబు చూపించే రెండు వేళ్లల్లో ఒకటి బాబు, రెండోది లోకేశ్!: పవన్ కల్యాణ్
- నేనెప్పుడూ ‘పిడికిలి’ చూపిస్తాను
- చంద్రబాబు రెండు వేళ్లు చూపిస్తారు
- ఐదువేళ్లతో అన్నం కలుపుకు తినొచ్చు
- రెండు వేళ్లతో కలుపుకు తినలేం
అదే చంద్రబాబు చూపించే ఆ రెండు వేళ్లల్లో ఒకటి చంద్రబాబు, మరోటి నారా లోకేశ్ అని, రెండు వేళ్లు జేబులో నుంచి డబ్బులు తీసుకోవడానికి పనికొస్తాయి తప్ప, అన్నం కలుపుకు తినడానికి పనికిరావని విమర్శించారు. రాష్ట్రంలో ఏ పని జరిగినా దానికి కారణం ‘నేను’ అని చంద్రబాబు అంటారే తప్ప, తమ పార్టీ నేతలు, నాయకులు కారణమని చెప్పిన సందర్భాలు లేవని, అదే పోలిక చంద్రబాబు తనయుడు లోకేశ్ కు కూడా వచ్చిందని విమర్శించారు.