ఇండియాకు ఇమ్రాన్ స్నేహ హస్తం.. పాక్ జైళ్లలో మగ్గుతున్న 27 మంది భారతీయుల విడుదల!
- భారత్ తో సత్సంబంధాలను కోరుకుంటున్నానన్న సంకేతాలు
- ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే విడుదల
- వాఘా బార్డర్ వద్ద భారత్ కు అప్పగించనున్న పాక్
వీరంతా గుజరాత్ కు చెందిన మత్స్యకారులుగా తెలుస్తోంది. వేటకు వెళ్లిన వీరు, పాక్ జలాల్లోకి ప్రవేశించడంతో, పాక్ సైన్యం వీరిని అదుపులోకి తీసుకుని కరాచీ జైలుకు తరలించింది. ఆపై వీరిని లాహోర్ జైలుకు మార్చింది. వీరంతా దాదాపు రెండేళ్లుగా జైళ్లలో ఉన్నారు. ఇమ్రాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజు వీరిని వాఘా సరిహద్దుల వద్ద భారత అధికారులకు అప్పగిస్తామని పాకిస్తాన్ పేర్కొంది. లాహోర్ నుంచి రోడ్డు మార్గం ద్వారా వాఘా వరకూ వీరిని తీసుకు వస్తామని అధికారులు తెలిపారు.