సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Add ap7am to your home Screen

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • కన్నడ సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్ 
  • ఎన్టీఆర్, చరణ్ చిత్రం అప్-డేట్స్ 
  • రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో 'రాణి శివగామి'
*  రెండేళ్ల క్రితం 'జాగ్వార్' కన్నడ చిత్రంలో స్పెషల్ సాంగులో నర్తించిన కథానాయిక తమన్నా మళ్లీ ఇప్పుడు మరో కన్నడ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనుంది. యంగ్ హీరో యాశ్ నటిస్తున్న 'కె.జి.ఎఫ్' సినిమాలో ఈ ముద్దుగుమ్మ ఓ ప్రత్యేక గీతంలో డ్యాన్స్ చేయడానికి అంగీకరించింది. ఇందుకోసం భారీ పారితోషికాన్నే తీసుకుంటున్నట్టు సమాచారం.
*  రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా ఓ భారీ మల్టీ స్టారర్ రూపొందనున్న సంగతి విదితమే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన లొకేషన్ల వేటలో దర్శకుడు వున్నారు. హైదరాబాదు శివారులో ఓ ప్రదేశాన్ని ఎంచుకున్నారని, అక్కడ సెట్స్ వేసి ఎక్కువ భాగం షూటింగును అక్కడే కానిస్తారని తెలుస్తోంది. నవంబర్ నుంచి ఈ షూటింగ్ మొదలవుతుంది.
*  ప్రముఖ నటి రమ్యకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తోన్న 'రాణి శివగామి' చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇది సోషియో ఫాంటసీ చిత్రమని, 9వ శతాబ్దంలో మొదలై 21వ శతాబ్దం వరకు సాగే కథతో ఇది రూపొందుతోందని దర్శకుడు మురళీకృష్ణ తెలిపారు.
Thamanna
NTR
Charan
Ramyakrishna

More Telugu News