జీవీఎల్ ఒక సన్నాసి.. రాష్ట్రానికి శనీశ్వరుడిగా తయారయ్యాడు: కుటుంబరావు
- దమ్ముంటే ఏపీ నుంచి వార్డు మెంబర్ గా గెలువు
- పీడీ ఖాతా అంటే ఏమిటో కూడా తెలియదా?
- నిధులు దుర్వినియోగం చేస్తున్నట్టు ఆధారాలుంటే కోర్టుకు వెళ్లు
కేంద్ర ప్రభుత్వ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందనే అనుమానాలు ఉంటే... ప్రభుత్వ ఖాతాలు సరిగా లేవని సీబీసీకి ఫిర్యాదు చేయవచ్చు కదా? అంటూ కుటుంబరావు దెప్పి పొడిచారు. 'దుర్వినియోగానికి పాల్పడుతున్నట్టు నీ దగ్గర ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్లు' అంటూ హితవు పలికారు. రాఫెల్ ఒప్పందంలో జరిగిన రూ. 29వేల కోట్ల అవినీతి గురించి జీవీఎల్ ఏం చెబుతారని ఎద్దేవా చేశారు.