ఎమ్మెల్యేలు బొల్లినేని, పెందుర్తిలపై చంద్రబాబు ఆగ్రహం
- ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఉపేక్షించను
- పార్టీ ప్రతిష్టను దిగజార్చితే ఊరుకోను
- టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో చంద్రబాబు
ఈ రోజు అమరావతిలో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, అధికారుల పట్ల ఎమ్మెల్యేలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఉపేక్షించనని హెచ్చరించారు. పార్టీ ప్రతిష్టను దిగజార్చే వారిని వదులుకునేందుకూ సిద్ధమేనని అన్నారు.