పెట్రోలు బంకుల ముందు 'నో స్టాక్' బోర్డులు... పెట్రోలు కోసం భారీ క్యూలైన్లు!
- పెట్రోలు వినియోగదారులపై లారీల సమ్మె ప్రభావం
- సింగిల్ పర్మిట్ విధానాన్ని డిమాండ్ చేస్తున్న లారీల యజమానులు
- పలు బంకుల వద్ద పెరిగిన రద్దీ
ఇప్పటికే లారీల సమ్మెతో నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడగా, పండ్లు, కూరగాయల ధరలు పెరిగాయి. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాల సరఫరాకూ అవాంతరాలు ఏర్పడ్డాయి. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం లేదన్న విమర్శలూ వస్తున్నాయి. సమ్మెలో మొత్తం 90 లక్షల లారీలు పాల్గొంటున్నాయని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు వి.శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. లారీల యజమానులవి న్యాయమైన డిమాండ్లేనని, సమ్మె విరమణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.