సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Add ap7am to your home Screen

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • తమన్నాకి పెళ్లి కుదిరిందా?
  • 'ఎన్టీఆర్' మొదటి షెడ్యూల్ పూర్తి 
  • సెన్సార్ పూర్తి చేసుకున్న 'సాక్ష్యం'
  • వచ్చే నెలలో కమలహాసన్ సినిమా  
*  మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా త్వరలో పెళ్లి చేసుకోబోతోందనే వార్తలు టాలీవుడ్ లో బాగా వినిపిస్తున్నాయి. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లని, అమెరికాలోని ఓ ఎన్నారై డాక్టర్ని ఈ ముద్దుగుమ్మ పెళ్లాడనుందని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది త్వరలో తెలుస్తుంది.
*  ప్రముఖ నటుడు దివంగత ఎన్టీ రామారావు జీవితంపై రూపొందిస్తున్న 'ఎన్టీఆర్' బయోపిక్ మొదటి షెడ్యూల్ షూటింగ్ ముగిసింది. హైదరాబాదులో జరిగిన ఈ షెడ్యూల్ లో బాలకృష్ణ, విద్యాబాలన్ తదితరులపై ముఖ్య సన్నివేశాలను దర్శకుడు క్రిష్ చిత్రీకరించారు.
*  బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన 'సాక్ష్యం' చిత్రం సెన్సార్ పూర్తయింది. దీనికి సెన్సార్ U/A సర్టిఫికేట్ ను ఇచ్చింది. కాగా, ఈ 27న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.
*  కమలహాసన్ తను నటిస్తూ దర్శకత్వం వహించిన 'విశ్వరూపం 2' చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. వచ్చే నెల 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దీనిని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
Tamannaah
NTR
Balakrishna
Kamal Haasan

More Telugu News