అజిత్ ఎలా వుంటాడనేది నేను ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యపోయాను: 'ఛత్రపతి' శేఖర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అజిత్ ఎలా వుంటాడనేది నేను ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యపోయాను: 'ఛత్రపతి' శేఖర్

  • ఆయనకి గొడుగుపట్టే అసిస్టెంట్ వుండడు 
  • ఎంత ఎండలోనైనా అలాగే నుంచుంటారు
  • బిర్యాని చేసి మాకు స్వయంగా వడ్డించారు   
'ఛత్రపతి' శేఖర్ మొదటినుంచి కూడా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ, తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన తమిళంలో అజిత్ మూవీలో చేస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన అజిత్ గురించిన విషయాలను ప్రస్తావించాడు. "ఇటీవల ఎండల్లో షూటింగు మొదలైంది. మొదటి రోజున దర్శకుడు నన్ను ఆయనకి పరిచయం చేశాడు. 'బాగున్నారా' అంటూ ఆయన చాలా ఆత్మీయంగా పలకరించారు.సెట్లోకి వస్తూనే నవ్వుతూ ప్రతి ఒక్కరినీ పేరు పేరునా ఆయన పలకరిస్తూ దగ్గరికి తీసుకుంటారు. ఆయనకి గొడుగుపట్టే అసిస్టెంట్ ఉండడు .. అది ఆయనకి ఇష్టం వుండదట. ఆయనలా గొడుగు కూడా లేకుండా ఎండలో సీన్ చేయడం .. షాట్ ఓకే అని డైరెక్టర్ చెప్పేంతవరకూ .. రిలాక్స్ అవ్వండి అనేంత వరకూ స్పాట్ లోనే ఉండటం చూసి నేను షాక్ అయ్యాను. రెండు సార్లు ఆయన అందరికీ బిర్యాని చేసి .. స్వయంగా వడ్డించారు. నిజం చెప్పాలంటే ఆయన సింప్లిసిటీ చూసి నాకు మెంటలొచ్చేసింది" అని చెప్పుకొచ్చాడు.         
ajith
sekhar

More Telugu News