'జై లవ కుశ'కు అరుదైన గౌరవం!
- బాబీ దర్శకత్వంలో వచ్చిన 'జై లవ కుశ'
- బుచీయోన్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో చోటు
- కథాకథనాలు .. పాత్రల్లోని వైవిధ్యం కారణం
ఉత్తమ ఏషియన్ సినిమా విభాగంలో 'జై లవ కుశ' కి ఈ గౌరవం దక్కింది. ఈ చిత్రోత్సవంలో చోటు లభించిన ఏకైక తెలుగు సినిమా 'జై లవ కుశ' కావడం విశేషం. ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్స్ తో మూడు విభిన్నమైన పాత్రలను పోషించడం .. మూడు పాత్రలు ఒకేసారి తెరపై కనిపించడం .. పాత్రల్లోని వైవిధ్యం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. దేవిశ్రీ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ హైలైట్స్ ఈ సినిమాకి ఈ గౌరవాన్ని తెచ్చిపెట్టాయనే అభిప్రాయాలు వ్యక్తవుతున్నాయి.