'ఎన్టీఆర్' బయోపిక్ కి భారీ రేట్లు!
Add ap7am to your home Screen

'ఎన్టీఆర్' బయోపిక్ కి భారీ రేట్లు!

  • షూటింగు దశలో 'ఎన్టీఆర్'
  • ఏరియా హక్కుల కోసం పోటీ 
  • సంక్రాంతికి విడుదల
క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' బయోపిక్ రూపొందుతోంది. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తుండగా .. బసవతారకం పాత్రలో విద్యాబాలన్ కనిపించనున్నారు. రానా .. ప్రకాశ్ రాజ్ .. ముఖ్యమైన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. షూటింగు తొలిదశలో ఉండగానే ఈ సినిమా ఏరియాల వారీ హక్కుల కోసం ప్రయత్నాలు మొదలైపోయినట్టుగా వినికిడి.

ఈ తరం స్టార్ హీరోల సినిమాల స్థాయిలో రేట్లు చెబుతున్నారట. సావిత్రి బయోపిక్ గా వచ్చిన 'మహానటి' సినిమా 40 కోట్ల షేర్ ను రాబట్టింది. 'ఎన్టీఆర్' బయోపిక్ అంతకి రెట్టింపు వసూలు చేయగలదనే నమ్మకంతోనే భారీ రేట్లు చెబుతున్నారట. ఎన్టీఆర్ కి గల క్రేజ్ .. మాస్ ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని, అన్ని హక్కులను కలుపుకుని 100 కోట్లకి తక్కువగా అమ్మే ఆలోచనలో నిర్మాతలు లేరనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.    
balakrishna
vidyabalan

More Telugu News