ఏపీలో ప్రజా సమస్యల పరిష్కారానికే ‘గ్రామ దర్శిని’: మంత్రి కాలవ శ్రీనివాసులు

16-07-2018 Mon 21:02 | Andhra
  • రాయ‌దుర్గంలోని ‘వార్డు దర్శిని’ ప్రారంభించిన కాలవ
  • పేద‌ల సంక్షేమమే ప్ర‌భుత్వ ల‌క్ష్యం 
  • పేద‌రికం లేని స‌మాజమే చంద్ర‌బాబు ఆశ‌యం
ఏపీలో ప్రజా సమస్యలు, అవసరాలు తీర్చడానికే గ్రామ దర్శిని, వార్డు దర్శిని కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని రాష్ట్ర సమాచార, గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. రాయ‌దుర్గం పట్టణంలోని 13వ వార్డులో ‘వార్డు దర్శిని’ కార్య‌క్ర‌మాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పేద‌ల సంక్షేమ‌మే ల‌క్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌నిచేస్తోందని, పేద‌రికం లేని స‌మాజమే సీఎం చంద్ర‌బాబునాయుడు ఆశ‌యం అని అన్నారు. దీనిలో భాగంగా గ్రామ దర్శిని, వార్డు దర్శిని కార్యక్రమాలతో ప్రజా అవసరాలు, సమస్యలు పరిష్కరించడానికి ప్రజల చెంతకు ప్రభుత్వం వచ్చిందని, పట్టణాల్లో ఇళ్లు లేని నిరుపేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాన్ని, ఇళ్ల నిర్మాణాలకు నిధులు అందజేస్తున్నట్టు చెప్పారు.పెన్షన్ల మొత్తాన్ని ఐదు రెట్లు పెంచామని, మ‌హిళా స్వ‌యంశ‌క్తి సంఘాల‌కు పెట్టుబ‌డి ప్రోత్సాహకాన్ని అందించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నామని  అన్నారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు విశేష కృషి చేస్తున్నారని, పేద‌ల సంక్షేమం, అభివృద్ధి కోసం రాత్రింబవళ్లు కృషి చేస్తున్న చంద్ర‌బాబును ప్ర‌జ‌లు ఆశీర్వదించి అండ‌గా నిల‌వాలని కోరారు. గ‌డ‌చిన నాలుగేళ్ల‌లో రూ.3000 కోట్ల‌ విలువైన అభివృద్ధి పనులను రాయ‌దుర్గంలో చేప‌ట్టినట్టు చెప్పారు. అనంతరం, ఆ వార్డులో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. వ్యక్తిగత, సామూహిక సమస్యలను పరిష్కారిస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా వార్డులోని పెన్షనర్లతో కలిసి సామూహిక అల్పాహార విందులో కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంతరం రాయదుర్గం నియోజకవర్గం డి.హిరేహాల్ మండలంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మండల కేంద్రంలో రూ.30 లక్షలతో మైనార్టీ కమ్యూనిటీ హాల్, రూ.7 లక్షలతో నిర్మించనున్న అంగన్ వాడీ కేంద్రాలకు భూమి పూజ చేశారు. అదే ప్రాంతంలో రూ.24.60 లక్షలతో నిర్మించిన వ్యవసాయ గోదామును ప్రారంభించారు. 
anantapuramkalva srinivasulu

More Telugu News

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17
..more