స్విస్ బ్యాంకు భారతీయుల ఖాతాలో రూ.300 కోట్లు.. తేలుకుట్టిన దొంగల్లా ఖాతాదారులు!
- స్విస్ బ్యాంకు ఖాతాల్లో రూ.వందల కోట్లు
- ఎవరివో తెలియడం లేదన్న బ్యాంకు
- ఆరింటిలో మూడు ఎన్ఆర్ఐలవి
ఆ ఖాతాలు తమవే అని చెప్పి ముందుకొస్తే అనవసర ఇబ్బందుల్లో చిక్కుకుంటామనే ఉద్దేశంతో ఖాతాదారులు గుంభనంగా ఉన్నట్టు తెలుస్తోంది. స్విస్ బ్యాంకులో అక్రమంగా సొమ్ము దాచిపెట్టినట్టు తెలిస్తే కఠిన శిక్షలు తప్పవన్న కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో ఆ రూ.300 కోట్లను ఎవరూ క్లెయిమ్ చేసుకోవడం లేదని సమాచారం.