'ఎన్టీఆర్'పై పెరుగుతోన్న అంచనాలు .. ఓవర్సీస్ రైట్స్ కోసం భారీ ఆఫర్
Add ap7am to your home Screen

'ఎన్టీఆర్'పై పెరుగుతోన్న అంచనాలు .. ఓవర్సీస్ రైట్స్ కోసం భారీ ఆఫర్

  • నాగిరెడ్డిగా ప్రకాశ్ రాజ్ 
  • బీఏ సుబ్బారావుగా సీనియర్ నరేశ్ 
  • సంక్రాంతికి విడుదల  
'ఎన్టీఆర్' బయోపిక్ కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే మొదలైపోయింది. మరో వైపున ఈ సినిమాకి సంబంధించిన ముఖ్యమైన పాత్రలకిగాను నటీనటుల ఎంపిక కొనసాగుతోంది. ఇప్పటికే బసవతారకం పాత్రకి గాను విద్యాబాలన్ ను .. నాగిరెడ్డి పాత్రకి గాను ప్రకాశ్ రాజ్ ను .. బీఏ సుబ్బారావు పాత్రకి గాను సీనియర్ నరేశ్ ను ఎంపిక చేశారు.

ఇలా ఈ సినిమా తారాగణం పెరిగిపోతూ ఉండటంతో అంచనాలు కూడా పెరుగుతున్నాయి. దాంతో సహజంగానే ఈ విషయం ఈ సినిమా బిజినెస్ పై ప్రభావం చూపుతోంది. ఈ సినిమా ఓవర్సీస్ హక్కుల కోసం ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ 12 కోట్లను ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇది అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం కావడంతో, కీరవాణి ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టుగా చెబుతున్నారు. సంక్రాంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమాను జనవరి 9న విడుదల చేయనున్నారు.  
balakrishna
vidya balan

More Telugu News