ఈ నెల 16న అమేజాన్ ప్రైమ్ డే సేల్... 200 ఉత్పత్తుల విడుదల... తక్కువ ధరల ఆఫర్లు
- 36 గంటల పాటు విక్రయాలు
- అతి తక్కువ ధరలకే ఆఫర్లు
- ఆర్డర్ చేసిన రెండు గంటల్లో డెలివరీ
రోజువారీ నిత్యావసరాలు, ఫ్యాషన్ ఉత్పత్తులను ఏడాదిలోనే అత్యంత తక్కువ ధరలకు ప్రైమ్ సేల్ లో ఆఫర్ చేయనుంది. అంతర్జాతీయ సెల్లర్ల ఆఫర్లను కూడా భారతీయ కస్టమర్లకు అందిస్తామని అమేజాన్ తెలిపింది. ఇక ఈ సేల్ లో భాగంగా రెండు గంటల్లో డెలివరీ సర్వీస్ ను అమేజాన్ పరీక్షించనుంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, న్యూఢిల్లీ నగరాల్లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, అమేజాన్ పరికరాలు, నిత్యావసరాలను ఆర్డర్ చేసిన రెండు గంటల్లోపు అందించనుంది. అమేజాన్ ఇటీవలే రూ.129తో నెలవారీ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ను కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే.